అర్జున్‌ ఎంపికపై గంగూలీ ఏమన్నాడంటే ? | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 9 2018 7:04 PM

What Sourav Ganguly Said About Arjun Tendulkar Selection  - Sakshi

ముంబై : క్రికెట్‌ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ భారత అండర్‌-19 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. తనయుడి ఎంపికపట్ల ఇప్పటికే సచిన్‌ సంతోషం వ్యక్తం చేస్తూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. కెరీర్‌లో తొలి మైలురైయిని అందుకున్న అర్జున్‌కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. ‘చాలా మంది అర్జున్‌కు విషెస్‌ తెలియజేస్తున్నారు. నేను అయితే ఇప్పటి వరకు అతని ఆట చూడలేదు. అతను అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను.’ గంగూలీ పేర్కొన్నాడు.

శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌–19 జట్టులోకి అర్జున్‌ ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్‌ జట్టు లంకలో రెండు నాలుగు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. అర్జున్‌ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే ఈ టోర్నీలో తప్పక రాణించాల్సిందే. ఎందుకంటే అర్జున్‌ వచ్చే( 2020) అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆడలేడు. అప్పటికే అతని వయసు 19 ఏళ్లు దాటుతోంది. అర్జున్‌కు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. ఐపీఎల్‌ చైర్మెన్‌ రాజీవ్‌ శుక్లా సైతం అర్జున్‌ బాగా రాణిస్తాడని ఆకాంక్షించారు.

పాకిస్తానే గెలిచింది..
ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లి సేన రాణిస్తోందని గంగూలీ జోస్యం చెప్పాడు. ‘ ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్‌ విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నా. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ గెలవడానికి ఆడిన ఆట ఇక్కడ పునరావృతం అయితే భారత్‌ విజయం సులువు.’ అని అభిప్రాయపడ్డాడు. ఇక కోహ్లి సేన ఇంగ్లండ్‌ పర్యటనలో జూలై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్ట్‌లు ఆడనుంది. ఇటీవల పాక్‌తో ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌లో 9 వికెట్లతో ఓడి తరువాత సిరీస్‌ సమం చేసిన విషయం తెలిసిందే. ‘పాకిస్తానే గెలిచింది.. అలాంటప్పుడు భారత్‌ సులువుగా సీరీస్‌ గెలుస్తోంది. పాక్‌ కన్నా భారత్‌కు చాలా అవకాశాలున్నాయి.’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement